Nagababu Departs from Anakapalli..! : అనకాపల్లి నుంచి నాగబాబు తప్పుకున్నారా?..తప్పించారా?

0
16

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారమే లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి రంగంలోకి దిగుతుండగా..మరోసారి అధికారం దక్కించుకోవాలని వైఎస్సార్ సీపీ ప్రయత్నిస్తోంది. దీంతో ఎన్నికల వాతావరణం రసవత్తరంగా మారింది.

టీడీపీ,జనసేన కూటమిలో భాగంగా 24 అసెంబ్లీ, 3ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ అభ్యర్థులను ఖరారు చేయటం కోసం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 5స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ మిగతా స్థానాల కోసం అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ బరిలో పోటీకి దిగనున్నాడని ప్రచారం ఊపందుకుంది.

అయితే లెటేస్ట్ టాక్ ఏంటంటే.. అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి నాగబాబును బరిలో దింపాలన్న ఆలోచనను పవన్ విరమించుకున్నాడని తెలుస్తోంది. అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్న కొణతాల నాగబాబు పట్ల అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో నాగబాబు చేస్తున్న సమీక్షలకు కొణతాల నుండి సహకారం అందట్లేదట అందుకే నాగబాబును అనకాపల్లి కాకుండా వేరే చోటు నుండి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాడంట పవన్.