RTC and Singareni Not For Sale Bhatti Vikramarka: ఆర్టీసీని, సింగరేణిని అమ్మే ప్రసక్తే లేదు: భట్టి విక్రమార్క

0
16

రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్టీసీ,సింగరేణిని అమ్మే ప్రసక్తే లేదని..ప్రైవేట్ పరం చేయబోమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్టీసీ, సింగరేణితో దాదాపు లక్షమందికి ఉపాధి కల్గుతుందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి హైద్రాబాద్ నెక్లెస్ రోడ్ లో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. గత ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం ఇబ్బంది పడ్డారని.. ఆర్టీసీ సంస్థ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు.

టీఎస్ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం అందిస్తూనే ఉంటుందన్నారు భట్టి. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని చెప్పారు.22 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఆగస్టు నాటికి మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మీ స్కీం అమలు చేస్తున్నామని.. మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు డీప్యూటీ సీఎం. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కృషికి ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనిది.. 3 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.