TS CM Revanth Reddy: ఇల్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు..ముందు వాళ్లకే..

0
22

ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభించే ఇందిరమ్మ ఇల్లు పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికే రూ.5 లక్షలు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఏడాది 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని ఆయా ఇళ్లను మహిళల పేరు మీదే ఇస్తామన్నారు. పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్లు. మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షిస్తారని చెప్పారు.

రెండు రోజుల క్రితం ప్రభుత్వం రాష్ట్రంలో 95 వేల235 ఇండ్లు మంజూరు చేస్తూ జీవో రిలీజ్ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 57,141 ఇండ్లు, అర్బన్ ఏరియాల్లో 38,094 ఇండ్లకు అనుమతిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కో సెగ్మెంట్​కు ఫస్ట్ ఫేజ్​లో భాగంగా 800 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.