ఇవాళ మహిళల ఖాతాల్లోకి రూ.15 వేలు

0
15

ఈబీసీ నేస్తం పథకం కింద ఏపీలో అర్హులైన 4.19,853 మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.15,000 చొప్పున సీఎం జగన్ రూ.629.37 కోట్లు జమ చేయనున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి ఈ నగదు జమ చేస్తారు. ఈ స్కీమ్ కింద రెడ్డి. కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన 45-60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సాయం అందుతుంది.

జగన్ షెడ్యూల్

జగన్ గురువారం ఉదయం తాడేపల్లి నుంచి బయలు దేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. గన్నవరం నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం(కర్నూల్‌) చేరుకుని అక్కడి నుంచి జగన్నాథగట్టుకు చేరుకుంటారు. అక్కడ జాతీయ న్యాయవిశ్వ విద్యాలయానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేస్తారు. కల్లూరు మండలం లక్ష్మీపురం జగన్నాథగట్టుపై 150 ఎకరాల్లో రూ.1,011 కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణం జరగనుంది. లా యూనివర్సిటీ కార్యక్రమం ముగిశాక అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నంద్యాల జిల్లా బనగానపల్లెకు బయలుదేర్తారు. ఈబీసీ పథకం ప్రారంభిస్తారు. అనంతరం మధ్యామ్నం గన్నవరం బయల్దేరుతారు.

16న ఫైనల్ లిస్ట్

ఈ నెల 16న సీఎం జగన్ ఇడుపుల పాయకు వెళ్లనున్నారు.అదే రోజు వైసీపీ తుది జాబితా అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన జాబితాల వారీగా చూస్తే 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్‌ స్థానాలకు వైసీపీ ఇన్‌ఛార్జిలను నియమించింది. అదే రోజు ఇచ్ఛాపురం నుంచి జగన్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది.