Modi Comming To Chilakaluripeta: ఈ నెల 17న ఏపీకి మోదీ.. 2014 సీన్ రిపీట్

0
39

ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన ఖరారయ్యింది. ఈ నెల 17న చిలకలూరిపేటలో తలపెట్టిన సభకు మోదీ రానున్నారు. చిలకలూరిపేటలోని బొప్పుడి ఆంజనేయస్వామి గుడి పక్కన సుమారు 150 ఎకరాల్లో ఈ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ స్థలాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సభ ద్వారా మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు.

టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు, జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

టీడీపీ, జనసేన ఎన్డీఏలో చేరడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ అందరినీ కలుపుకుని, రాజకీయాలకు బలమైన వేదికగా మారుతోందన్నారు.