ఏనుగు తెచ్చిన కారు చిచ్చు.. బీఆర్ఎస్కు షాకులు

0
32

కారు, ఏనుగు పొత్తుల వ్యవహారం ఇరు పార్టీలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగేందుకు రెడీ అయ్యారు. బుధవారం తన అనుచరులతో హైదరాబాద్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తన రాజకీయ భవితవ్యంపై క్లారిటీ ఇస్తానని చెబుతున్నారు. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ బాబు గెలిచారు. హరీశ్ బాబుకు 63,702 ఓట్లు రాగా కోనప్పకు 60614 ఓట్లు లభించాయి. ఇక్కడి నంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 44,646 ఓట్లు సాధించారు. తన ప్రత్యర్థితో పొత్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న కోనప్ప కారు దిగనున్నారని సమాచారం.

కోనేరు బాటలోనే మరో ఇద్దరు లీడర్లు ఇంద్రకరణ్ రెడ్డి, విఠల్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడుతారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో జత కట్టడాన్ని దళిత సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సాక్ష్యాలు చూపించి మరి చెండాడిన ఆర్ఎస్పీ పార్లమెంటు ఎన్నికల ముందు కేసీఆర్ తో జతకట్టడం చర్చనీయాంశం గా మారింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు, మేధావులు, సామాజికవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఒక్క ఎంపీ సీటు కోసం బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారా? అని ప్రశ్ని స్తున్నారు