Janasena Seats Downing: జనసేన సీట్లు మరింత తగ్గాయా.. పవన్ మాటలకు అర్థమేంటి..?

0
23

కూటమి కుదిరింది. టీడీపీతో సంబంధం లేకుండా బీజేపీ-జనసేన తేల్చుకోవాల్సిన టైం వచ్చింది. మరి బీజేపీకి నమ్మకస్తుడిగా ఉన్న పవన్ కల్యామ్ తన 24 అసెంబ్లీ సీట్లనుంచి మరిన్ని తగ్గేందుకు రెడీగా ఉన్నారా.. ఔననే అంటున్నాయి తాజా పరిస్థితులు.

జనసేన కార్యకర్తలకు అధినేత పవన్ కళ్యాణ్‌ అన్యాయం చేస్తున్నారంటూ వైసీపీ విమర్శిస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సీట్ల పంపకాలతో పాటు.. పొత్తు అంశాలపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపకం జరిగిందనీ పవన్ కళ్యాణ్ అన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని ట్విట్టర్‌ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నరేంద్ర మోదీ శక్తివంతమైన, దార్శనిక నాయతక్వంలో ఏపీలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేస్తాయని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని పవన్ కళ్యాణ్‌ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకం జరిగిందని అన్నారు. కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభిశృద్ధికి ఒక బలమైన పునాదిపడిందని ప్రగాఢ విశ్వాసమని పవన్ కళ్యాణ్‌ అన్నారు. సీట్లు కాదు.. రాష్ట్రం బాగు ముఖ్యమన్న పవన్ మాటలు దేనికి సంకేతమనేది ఒకట్రెండు రోజుల్లో తేలిపోనుంది.