April : జాగ్రత్త… ఈ విషయాల్లో అస్సలు ఏప్రిల్ ‘ఫూల్’ అవ్వొద్దు!

0
18

ఏప్రిల్ 1.. ఈరోజు స్నేహితులు, బంధువులు అబద్ధాలతో ఫూల్‌ను చేస్తుంటారు. సరదాగా స్నేహితులను ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ ఆటపట్టిస్తుంటారు. ఇలా ఆట పట్టించడంలో పిల్లలు ముందు వరుసలో ఉంటారు. ‘నీ షర్ట్ కు ఏదో అంటుకుంది’, ‘నిన్ను ఎవరో పిలుస్తున్నారు’ అంటూ ప్రాంక్స్ చేస్తూ సరదాగా గడుపుతుంటారు. కొందరైతే ఫూల్ చేసేందుకు ముందుగానే ప్రణాళికలు చేస్తుంటారు.

దీంతో పెద్ద నష్టం లేకపోయినా కొన్ని విషయాల్లో ఫూల్ అవ్వకుండా జాగ్రత్త పడాలని పలువురు సూచిస్తున్నారు. సైబర్ మోసాలు, సోషల్ మీడియాలో సంబంధాలు, ఆఫర్ల పేరిట బురిడీ కొట్టించే లింకులు క్లిక్ చేయడం, ఇతరులను గుడ్డిగా నమ్మడం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఆన్‌లైన్ పరంగా ఏ నిర్ణయమైనా ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు.

ఏప్రిల్ ఒకటిన జనాలను ఆటపట్టించి ఫూల్స్ చేయడమనేది ఎలా వచ్చిందన్న దానిపై చాలా కథలు ఉన్నాయి. అందరూ నిజమని నమ్మేది మాత్రం ఒకటి ఉంది. 1582లో జూలియన్ క్యాలెండర్ నుంచి జార్జియన్ క్యాలెండర్ వైపుకు సమాజం మారింది. జార్జియన్ క్యాలెండర్లో కొత్త సంవత్సరం జనవరి 1న ఉంటుంది. జూలియన్ క్యాలెండర్లో ఇది ఏప్రిల్ 1.

అయితే ఈ కొత్త క్యాలెండర్కు ఇంకా అలవాటు పడని కొంతమంది జనం మాత్రం ఏప్రిల్ ఒకటినే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే, ‘ఏయ్.. ఏప్రిల్ పూల్స్’ అని ఆట పట్టించారట. అప్పట్నుంచి ఏప్రిల్ ఒకటిన ఏప్రిల్ ఫూల్స్ అనటం కామన్ అయిందని చెప్పుకుంటారు. ప్రపంచమంతటా ‘ఏప్రిల్ ఫూల్ డే’ సెలబ్రేట్ చేస్తుంటారు.