జిమ్ లో అర్జున్, సారా టెండుల్కర్..ఫోటోలు వైరల్

0
15

అర్జున్ టెండుల్కర్ తండ్రికి తగ్గ తనయుడని అనిపించేందుకు శ్రమిస్తున్నాడు. వచ్చే ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఫిట్ నెస్ కోసం జిమ్ లో తెగ చెమటోడుస్తున్నాడు. తన అక్క సారా టెండుల్కర్ తో కలిసి జిమ్ లో ఉన్న ఫోటోలు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సారా అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటుండగా అర్జున్ వెనకాల నిలబడి ఉన్నాడు.

ఐపీఎల్ 2021 సీజన్ లో ముంబై తరపున ఎంట్రీ ఇచ్చిన అర్జున్ ఆ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. తర్వాత 2023 సీజన్ లో అర్జున్ కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎడమచేతి వాటం పేసర్ అయిన అర్జున్ రెండు ఓవర్లలో 17 పరుగులివ్వగా.. వికెట్లేమీ తీయలేకపోయాడు. మొత్తంమీద తన నాలుగు ఐపీఎల్ మ్యాచుల్లో3 వికెట్లు తీశాడు. ఈ సారి చాన్స్ వస్తే ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయగలనన్న ధీమాతో ఉన్నాడు.

ఈ సీజన్ రంజీ ట్రోఫీలోనూ అర్జున్ టెండూల్కర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గోవా జట్టుకు ఆడుతున్న అర్జున్ 11 ఇన్నింగ్స్‌ల్లో 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్‌లో మెరిశాడు. రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 23.45 సగటుతో 258 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన గోవా చివరి గ్రూప్ మ్యాచ్‌లో అర్జున్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ రాణించాడు