టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ ఫస్ట్ బౌలింగ్

0
20

ధర్మశాల వేదికగా చివరి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. భారత్ ఫస్ట్ బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌తో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రజిత్‌ పాటిదార్‌ స్ధానంలో పడిక్కల్‌కు చోటు దక్కింది. మరోవైపు భారత స్పిన్‌ లెజండ్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో సైతం తన వందో టెస్టులో బరిలోకి దిగాడు.

చల్లటి వాతావరణంతో ధర్మశాలలోని పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఇటీవల ఇక్కడ జరిగిన ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రంజీ మ్యాచ్లో 36 వికెట్లను ఫాస్ట్ బౌలర్లే పడగొట్టారు. బ్యాటర్లు ఓపిగ్గా నిలదొక్కుకొంటే భారీ స్కోర్లు చేసే ఛాన్సుంది. ఇక తొలి రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా ఉండే అవకాశముంది. ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు(2017)లో ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది.

భారత్: రోహిత్(C), జైస్వాల్, గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, బుమ్రా.
ఇంగ్లండ్: క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్, స్టోక్స్(C), ఫోక్స్, హార్టీ, బషీర్, అండర్సన్, మార్క్ వుడ్.