డిసెంబర్ 9న కీలక ఫైళ్లు మాయం.. ఎవరీ ప్రణీత్ రావు.?

0
24

ప్రముఖుల,రాజకీయ నేతల ఫోన్ల ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా రాగానే..డిసెంబర్ 9న రాత్రి 9 గంటల సమయంలో ఆయన లాగర్ రూమ్‌కి వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్ ల తో పాటు వందల కొద్ది డాక్యుమెంట్లని ధ్వంసం చేసిన ప్రణీత్ రావు. ఆ సమయంలో ఎస్‌వోటీ లాగర్ రూమ్ సీసీ కెమెరాలను ఆఫ్ చేయించినట్లు విచారణలో వెల్లడయ్యింది. ఇంటెలిజెన్స్‌‌‌‌ సేకరించిన సిమ్‌‌‌‌ కార్డులకు చెందిన ఐఎమ్ఈఐ నంబర్స్‌‌‌‌ పూర్తిగా ఎరైజ్ చేశారు. వీటిలో ఉండే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ డేటాను తొలగించారు.

తాము రికార్డ్ చేసిన కాల్ రికార్డ్స్ లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రణీత్ రావు. ఇలా దాదాపు 1800 డాక్యుమెంట్లను ధ్వంసం చేసినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకే ఆధారాలను మాయం చేసినట్లు గుర్తించారు. ప్రణీత్‌‌‌‌రావుపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మాజీ ఐపీఎస్ ప్రభాకర్ బంధువే ప్రణీత్ రావు

మాజీ ఐపీఎస్‌, మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావు బంధువే ఈ ప్రణీత్‌ రావు. ప్రణీత్‌ కెరీర్‌లో అడుగడుగునా ప్రభాకర్‌ రావు అండ ఉంది. ప్రభాకర్‌ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్‌ ప్రొబేషన్‌ క్లియరెన్స్‌ అయ్యింది. అలాగే ప్రభాకర్‌ రావు ఎస్‌ఐబీ చీఫ్‌ కాగానే ప్రణీత్‌కు ఎస్‌ఐబీలో పోస్టింగ్‌ లభించింది. ఎస్‌ఐబీలో ఉన్న ఇతర ఇన్‌స్పెక్టర్లను కాదని ప్రణీత్‌ను వెనకేసుకొచ్చాని ప్రభాకర్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే నిబంధనలకు విరుద్దంగా ప్రణీత్‌కు డీఎస్పీగా ప్రమోషన్‌ ఇప్పించారని ప్రభాకర్‌ బలమైన ఆరోపణ కూడా ఒకటి ఉండడం గమనార్హం.అధికార దుర్వినియోగానికి పాల్పడిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే..