రికార్డు సృష్టించిన మహిళా క్రికెటర్

0
26

మహిళా క్రికెట్లో ముంబై ఇండియన్స్ బౌలర్ షబ్నీమ్ ఇస్మాయిల్ రికార్డు సృష్టించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచులో బంతిని గంటకు 132.1 కిలోమీటర్ల వేగంతో వేశారు. మ్యాచ్ మూడో ఓవర్ రెండో బంతికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ ప్యాడ్‌పై ఇస్మాయిల్ బౌల్ పిడుగులా పడింది. దీంతో మహిళా క్రికెట్లో అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన ప్లేయర్ గా నిలిచారు. ఈ దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ గతంలో 2016లో వెస్టిండీస్‌పై గంటకు 127, 128 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించారు.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధారాళంగా పరుగులిచ్చారు. తన కోటా 4 ఓవర్లు వేసిన షబ్నిమ్‌.. ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని కేవలం ఒక వికెట్ మాత్రమే తీశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గత ఏడాది జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 16 ఏళ్ల కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరఫున 8 టీ20 ప్రపంచకప్‌లలో ఆడారు. దక్షిణాఫ్రికా తరఫున 1 టెస్ట్, 127 వన్డేలు, 113 టీ20లు ఆడిన షబ్నిమ్‌.. 317 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టారు