రెండు చోట్ల పవన్ పోటీ.. అక్కడ గెలిస్తే కేంద్ర కేబినెట్ లోకి.?

0
15

ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. వైసీపీ సింగిల్ గా వస్తే..అధికార పార్టీని ఢీ కొట్టడానిక టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కూటమి 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా రిలీజ్ చేసింది. అయితే పవన్ పోటీ చేసే స్థానాలపై ఉత్కంఠ నెలకొంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక,భీమవరం నుంచి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈ సారి కూడా రెండు చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నారంట. అయితే ఈ సారి ఒక ఎంపీ..అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ ముందుగా భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ జనసేన శ్రేణులు, టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన సలహాతో పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా.. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఎంపీగా గెలిస్తే పవన్ ను కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని టాక్.

2009లో పీఆర్పీ ఉన్న సమయంలో అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనకాపల్లిలో దాదాపు 90% కాపు ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంకు మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయటానికి గల ప్రధాన కారణంగా భావిస్తున్నారు.