Rohith Leave It Mumbai Team: రోహిత్ ముంబైని విడిచిపెట్టి చెన్నైకి ఆడు.. రాయుడు కీలక వ్యాఖ్యలు

0
20

మహేంద్ర సింగ్ ధోనీకి ఈ ఐపీఎల్ చివరిదని వస్తోన్న రూమర్స్పై క్రికెటర్ అంబటి రాయుడు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ ధోనీ రిటైర్ అయితే 2025 ఐపీఎల్ లో సీఎస్ కే తరఫున రోహిత్ ఆడాలని కోరుకుంటున్నా. రోహిత్ కూడా ధోనీలా నాయకత్వం వహించగలరు. మరో ఐదారేళ్లు రోహిత్ ఐపీఎల్ ఆడగలడు. ఏ జట్టుకు కెప్టెన్ అవ్వాలనుకున్నా అవుతాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాయుడు. రోహిత్ సన్ రైజర్స్ కెప్టెన్ అవ్వాలని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సీజన్ లో మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే సీజన్ ప్రారంభంకాక ముందే ఈ సారీ ఐపీఎల్ హీట్ మొదలైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు విషయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యకు జట్టు పగ్గాలు ముంబై ఫ్రాంచైజీ అందించింది. అయితే ఐపీఎల్ 2025 సీజన్ ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు నుంచి నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలు అంటిపెట్టుకునే అవకాశం ఉంటుంది.రోహిత్ వయసు దృష్ట్యా 36 ఏళ్లు కావడంతో జట్టు వదులుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాయుడు ఈ వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ 2025 సీజన్ వరకు చెన్నై జట్టులోకి వెళ్లి కెప్టెన్సీ చేపట్టాలని సూచించాడు.

జనవరిలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు పది రోజులకే ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో రాయుడు భేటీ అయ్యాడు. రాయుడు గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.