సోయం ఔట్.. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రేసులో సోలంకి!

0
16

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈక్రమంలోనే డా.సోలంకి శ్రీనివాస్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. రాజకీయంగా దూకుడు వ్యవహరించడంతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కుల సమీకరణాలు ఆయనకు కలిసొచ్చే అంశాలుగా మారాయి.

దీంతో ఆశావహుల జాబితాలో సోలంకి పేరు ముందు వరుసలో ఉందని సమాచారం. సోలంకికి అధిష్టానం టికెట్ కేటాయిస్తే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు బిగ్ షాక్ ఇచ్చినట్లే అవుతుంది. బీజేపీ ఫస్ట్ లిస్టులో ముగ్గురు సిట్టి్ంగ్ ఎంపీలకు టికెట్లు కేటాయించగా.. సోయం బాపురావు పేరును మాత్రం హోల్ట్ లో పెట్టింది.

మరోవైపు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో తన పేరు లేకపోవడంపై సోయం బాపురావు అసంతృప్తి చెందారు. కొందరు ముఖ్య నేతలే తనకు టికెట్ రాకుండా అడ్డుపడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు , తాను ఎవరిపైనా ఆధారపడి రాజకీయం చేయడం లేదన్నారు. ఇప్పటికీ అధిష్టానంపై నమ్మకం ఉందని.. టికెట్ ఇవ్వకుంటే తన దారి తాను చూసుకుంటానని స్పష్టం చేశారు. తాజా సమాచారం మేరకు సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే ప్రచారం సాగుతోంది.