Liquor Scam: అసలేంటీ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ ?

0
10

ఢిల్లీ ప్రభుత్వం ఈ లిక్కర్ పాలసీని 2021లో తీసుకొచ్చింది. పాలసీ ప్రకారం.. మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంది. ప్రభుత్వ జోక్యం ఉండదు. మద్యం దుకాణాలు తెల్లవారుజామున 3గంటల వరకు తెరిచి ఉంటాయి. లిక్కర్ హోం డెలివరీ చేస్తారు. అయితే.. లైసెన్సుల జారీలో అవినీతి ఆరోపణలతో ఈడీ రంగంలోకి దిగింది. డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. తర్వాత కొన్నాళ్లకు ఈ పాలసీని సర్కార్ ఉపసంహరించుకుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఉందని 2022లో ఆగస్టు 21న బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ఆరోపించారు. ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో కవిత కలిశారని ఆయన అన్నారు. అప్పుడు వర్మపై కవిత పరువునష్టం దావా కూడా వేశారు. తనకు ఈ కేసుతో సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ.. కొంతకాలానికి ఈడీ ఆమెకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆమె అరెస్టయ్యారు. ఇలా.. 2ఏళ్ల క్రితం పర్వేశ్ తీగ లాగితే డొంక మొత్తం కదిలింది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు గతేడాది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు కూడా కవిత హాజరయ్యారు. ఆ తర్వాత మరోసారి ఆమెకు సమన్లు పంపింది. అయితే అవి మహిళల హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని, వాటిని కొట్టేయాలని కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2023 మార్చి 15న కోర్టు ఆమెకు ఉపశమనం కలిగించింది. సరిగ్గా ఏడాది తర్వాత 2024 మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసింది.