రాజ్ కోట్ టెస్ట్ సమయంలో స్పిన్నర్ అశ్విన్ అకస్మాత్తుగా జట్టును వీడటంపై ఆయన భార్య ప్రీతి ఎమోషనల్ గా స్పందించారు. ‘ఆ రోజు అశ్విన్ 500వికెట్ల మైలురాయిని చేరుకున్న కొద్దిసేపటికే మా అత్తయ్య సడన్ గా కిందపడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించాం. ఈ విషయం అశ్విన్ కు చెప్పొద్దనుకున్నాం. కానీ అతడు తల్లి దగ్గర ఉంటే బాగుంటుందని వైద్యులు చెప్పారు.
ఈ విషయాన్ని అశ్విన్‌కు ఫోన్‌లో చెప్పగానే అతడు ఎంతో బాధపడ్డాడు. మళ్లీ మాకు ఫోన్ చేసేందుకు 20-25 నిమిషాల సమయం పట్టింది. అర్ధరాత్రి ఇక్కడకు చేరుకున్నాడు. అతడు ఇక్కడకు చేరుకునేందుకు సహకరించిన రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, జట్టులోని ఇతర ఆటగాళ్లు, బీసీసీఐకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపింది. అశ్విన్ వందో టెస్టు ఆడనున్న నేపథ్యంలో అతడి భార్య ప్రతీ నారాయణన్ ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని వివరించింది.
క్రికెటర్లు ప్రతిష్ఠాత్మకంగా భావించే వందో టెస్టు మైలురాయిని రేపు అందుకోనున్నారు భారత స్పిన్నర్ అశ్విన్. కానీ బ్యాటర్లకు లభించిన స్టార్డమ్ ఆయనకు దక్కలేదనే చెప్పాలి. టెస్టుల్లో మినిమం 150 వికెట్లు తీసిన స్పిన్నర్లలో అత్యుత్తమ స్ట్రైక్ రేట్, భారత్లో అత్యధిక వికెట్లు, అత్యధిక ‘5 వికెట్లు’ అశ్విన్వే. ఆస్ట్రేలియాలో సిడ్నీ టెస్టులో(2021) నడుం నొప్పితోనే బ్యాటింగ్ ఆడి మ్యాచ్ ను డ్రా చేశారాయన