అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..ఫస్ట్ లిస్టులో 99 మంది అభ్యర్థులను ప్రకటించింది ఈ కూటమి. టీడీపీ 95 జనసేన 4 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే జనసేన 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. దీంతో జనసేన పోటీ చేసే స్థానాలు ఏవంటూ చర్చ జరిగింది లేటెస్ట్ గా జనసేన పోటీ చేసే స్థానాలు దాదాపు ఖరారయినట్లు చర్చ జరుగుతోంది. ఒక సారి ఆ స్థానాలేంటో చూద్దాం.
శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ (SC), విజయనగరం- జిల్లాలోని నెల్లిమర్ల, విశాఖ జిల్లాలోని విశాఖ- దక్షిణ, పెందుర్తి లేదా మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజోలు (SC), రాజానగరం, అమలాపురం, పిఠాపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని -భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు. నిడదవోలు, పోలవరం(ST), కృష్ణా జిల్లాలోని -విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ. గుంటూరు జిల్లాలోని – తెనాలి, ప్రకాశం జిల్లాలోని -దర్శి, రాయలసీమలో తిరుపతి. అనంతపురం, రైల్వేకోడూరు స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలోనే జనసేన అధిక సీట్లలో పోటీ చేస్తున్నటు తెలుస్తోంది.