Kavitha Shocking Decision: కవిత సంచలన నిర్ణయం. ఆ కమిటీలన్నీ రద్దు

0
17

భారత జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత జాగృతి సంస్థకు చెందిన అన్ని కమిటీలను రద్దు చేసున్నట్టు ప్రకటించారు.తెలంగాణలో గతేడాది ఆగస్టులో భారత జాగృతి సంస్థ కార్యకలాపాల కోసం వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. వాటిపై . విదేశీ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు కవిత కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కమిటీల తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.అయితే, ఈ కమిటీలను ఎందుకు రద్దు చేస్తున్నారన్నది ఆ ప్రకటనలో తెలియజేయలేదు.

రైతుల కరెంట్ బాధలు తెలవట్లేదా ?

తెలంగాణ రైతుల కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కరెంట్ కోతలతో రైతులు గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికారిక సభకు సంబంధించిన ఓ వీడియోను కవిత ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓ సభలో పాల్గొన్నారు. సభ జరుగుతుండగా కరెంట్ పోవడంతో అక్కడికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. అసెంబ్లీలో పవర్ కట్.. అధికారిక మీటింగ్ లోనూ కరెంట్ కోత.. అంటూ కవిత ట్వీట్ చేశారు.