Gruha Jyothi : గ్యాస్ సబ్సిడీ రావాలంటే రేషన్ కార్డ్ ఉండాల్సిందేనా?

0
13

రేషన్ కార్డ్ లేకపోతే ఏ ప్రభుత్వ పథకాన్ని మనం పొందలేం. ఇండియాలో ఆధార్, రేషన్ కార్డ్ చాలా ముఖ్యం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ చాలా సంవత్సరాల కిందటనే ఆగిపోయింది. దాంతో ఇప్పుడు చాలామంది దానికోసం ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఈ రేషన్ కార్డు లేక ప్రభుత్వాలు ఇచ్చే పథకాలను పొందలేకపోతున్నారు.. అయితే గృహ జ్యోతి స్కీం కింద ఇప్పటికే ఉచిత విద్యుత్తు పథకం అమలులోకి రావడం లేదు.

గృహజ్యోతి పథకం కోసం పలు మెలికలు పెట్టారు. ఇది చాలా మందిపై ప్రభావం చూపుతోంది. 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే వారికి తెల్ల రేషన్ కార్డులు ఆధార్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెప్పింది. గత సంవత్సరంలో చేసిన వినియోగాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. 2022- 23 సంవత్సరంలో వినియోగదారుడు నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం చేస్తే ఈ పథకం వర్తించదని చెప్తున్నారు. జీరో బిల్లులు ఇవ్వరు. అదేవిధంగా గృహ జ్యోతి పథకంగా ఎంపికైన 200 యూనిట్ల పైగా విద్యుత్తు వినియోగిస్తే పూర్తి బిల్లు చెల్లించవలసిందే.

అలాగే కరెంటు బిల్లులు బకాయి ఉన్న వినియోగదారులు కూడా గృహజ్యోతి పథకం అమలు కాదని ప్రభుత్వం చెప్తుంది. బకాయి చెల్లించిన తర్వాతే ఈ స్కీములు వర్తిస్తాయని చెప్తున్నారు అధికారులు. రూ.500కి సిలిండర్ గ్యాస్ పొందాలని అనుకునేవారు రేషన్ కార్డు సమర్పించకపోతే మాత్రం ఎటువంటి డబ్బు పొందలేరని సర్కారు క్లారిటీ ఇచ్చింది. అంటే సిలిండర్ సబ్సిడీ డబ్బులు వీరి అకౌంట్లోకి పడవు.