తెలంగాణలో టెన్త్ పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్ టికెట్లు ను స్కూళ్లకు అధికారులు పంపించారు. అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్సైటు నుంచి విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్ల కోసం చెక్ చేసుకోవచ్చు.
2024 మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు పరీక్ష రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. కాగా ఈ పరీక్షల కోసం 2,676 సెంటర్లను ఏర్పాటు చేయగా.. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు. గత అనుభవాల దృష్ట్యా మాల్ ప్రాక్టీస్‌ను అడ్డుకునేందుకు, ప్రశ్నాపత్రాల నిర్వహణ విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారు. ఇక.. ఏపీలో ఇప్పటికే ఏపీ 10వ తరగతి హాల్‌టికెట్లు విడుదలయ్యాయి.