నాన్నకు ప్రేమతో..! పాతికేళ్ల తర్వాత రోడ్డుపైకి ఎన్ ఫీల్డ్.. వైరల్

0
14

ప్రతి మనిషికి ఒక ఎమోషన్ ఉంటుంది. అది మనిషైనా.. కుక్కైనా.. వస్తువైనా.. వాహనమైనా. ఆ ఎమోషన్ కనెక్ట్ అయినప్పుడు అసలైన అనుభూతి ఉంటుంది. అదీ మనిషంటే. ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’.. ఇది కేవలం పేరు కాదు, రైడర్ల మనసు దోచిన బ్రాండ్. అందుకే 1979 నాటి ‘బుల్లెట్’ మళ్ళీ కొత్తరూపుతో రోడ్లపై దుమ్ములేపుతోంది.

ఇక్కడ కనిపిస్తున్న బైక్ 1979వ సంవత్సరం నాటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్. దీని యజమాని ఎన్ఎస్ జోషి. అప్పట్లో ఎర్నాకులంలోని నార్త్ పరవూర్‌లో ఈయనే మొదటి బుల్లెట్ బైక్ ఓనర్. జోషిని అప్పట్లో అందరూ ఎన్‌ఫీల్డ్ జోషి అని పిలిచేవారు. ఈ బైక్ కొనుగోలుకు సంబంధించిన ఇన్‌వాయిస్‌ ఇప్పటికీ ఆయన కొడుకుల దగ్గర ఉన్నట్లు సమాచారం. అప్పట్లో ఈ బైక్ ధర రూ.11399 మాత్రమే. ఈ బైకుకి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బైకు మీదున్నది జోషి కుమారులు కెల్విన్ జోషి. 2006లో జోషి కన్ను మూశారు. దీంతో బైక్ మూలనపడింది. కొన్నాళ్లపాటు ఎవరూ ఈ బైకును ఉపయోగించకపోవడం వల్ల తుప్పు పట్టిపోయింది. తండ్రి ఉపయోగించిన బైకు తుప్పు పడ్డటం నచ్చక జోషి చిన్న కొడుకు కెవిన్ ఓ మంచి మెకానిక్ ద్వారా బైకుని మళ్ళీ కొత్తగా మార్చాడు. కొత్త స్పోక్ వీల్స్, గోల్డెన్ పిన్‌స్ట్రిపింగ్‌తో కూడిన బ్లాక్ పెయింట్ జాబ్, హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లను అమర్చాడు.

చివరిసారి ఈ బండిని 1998లో ఉపయోగించారు. దాదాపు 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బైక్ కొత్త బైకుగా మారి రోడ్డు మీదకు వచ్చింది. ఈ బైక్ ఇప్పుడు చూడటానికి ఇప్పుడే కొన్న బైకు మాదిరిగానే అనిపిస్తుంది. తండ్రి జ్ఞాపకార్థం ఈ బైకుని జోషి కుమారులు ఉపయోగిస్తూ చాలా సంతోషిస్తున్నారు. ఇది బండి కాదు.. మమ్మల్ని ఇప్పటికీ మోసి, నడిపించే మా నాన్న అంటున్నారు వారి సంతానం. హైలైట్ కదా.