నేడు కాంగ్రెస్ తొలి జాబితా.. రాహుల్ పోటీపైనే ఉత్కంఠ!

0
17

నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ మాజీ చీఫ్‌లు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని పాల్గొననున్నారు. ఈ భేటీలో రాష్ట్రం నుంచి సీఈసీ సభ్యుడి హోదాలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ ఏర్పాటు చేసిన తెలంగాణ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు.3

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా వెలువడే అవకాశముంది. ఈ లిస్ట్ తెలంగాణ నుంచి 10 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర నేతలు ఆశావహుల పేర్లను అధిష్ఠానానికి సూచించారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, కరీంనగర్, నిజామాబాద్‌ స్థానాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఏఐసీసీ వర్గాల కథనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆయన తిరిగి ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కేరళలోని వయనాడ్‌ రెండింటి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రియాంకగాంధీ.. తల్లి సోనియాగాంధీ ఐదుసార్లు గెలిచిన రాయ్‌బరేలీ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.