భారత్-ఇంగ్లండ్ మధ్య చివరిదైన ఐదో టెస్ట్ నేడు ప్రారంభం కానుంది. ధర్మశాల వేదికగా ఉ.9.30 నుంచి ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే 3-1తో ముందంజలో ఉన్న భారత్.. ఈ మ్యాచులోనూ ఈ నెగ్గి సిరీస్ ను 4-1తో ముగించాలని భావిస్తోంది. మరోవైపు ఎలాగైనా ఈ మ్యాచులో గెలిచి పరువు దక్కించుకోవాలని ఇంగ్లండ్ చూస్తోంది. కాగా టీమ్ ఇండియా స్పిన్నర్ అశ్విన్, ఇంగ్లండ్ ప్లేయర్ బెయిర్ట్ లకు ఇది వందో టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం.
చల్లటి వాతావరణంతో ధర్మశాలలోని పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది. ఇటీవల ఇక్కడ జరిగిన ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రంజీ మ్యాచ్లో 36 వికెట్లను ఫాస్ట్ బౌలర్లే పడగొట్టారు. బ్యాటర్లు ఓపిగ్గా నిలదొక్కుకొంటే భారీ స్కోర్లు చేసే ఛాన్సుంది. ఇక తొలి రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలుగా ఉండే అవకాశముంది. ఇప్పటివరకూ ఇక్కడ జరిగిన ఏకైక టెస్టు(2017)లో ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది.
తుది జట్లు…
భారత్ : రోహిత్, యశస్వి, శుభ్‌మన్, రజత్, జడేజా, సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్, అశ్విన్, కుల్‌దీప్/ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా.
ఇంగ్లాండ్: క్రాలీ, డకెట్, పోప్, రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్, ఫోక్స్, హార్ట్‌లీ, మార్క్‌వుడ్, షోయబ్‌్ బషీర్, అండర్సన్.