Rishbh Panth Fit IPL: పంత్ ఐపీఎల్ కు ఓకే.. కానీ టీ20 వరల్డ్ కప్ కు డౌటేనా.?

0
16

క్రికెట్ ఫ్యాన్స్ కనుల విందునందించే మెగా టోర్నీ ఐపీఎల్ 17వ సీజన్ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదం నుంచి కోలుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఫిట్‌నెస్ సాధించినట్లు ప్రకటించింది. రెండేండ్ల క్రితం కారు ప్రమాదంలో మృత్యుంజ‌యుడిగా బ‌య‌ట‌ప‌డిన‌ పంత్, ఐపీఎల్ 17వ సీజ‌న్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

జట్టులో పంత్ రోల్ ఏంటనేదానిపై స్పష్టత లేనప్పటికీ.. పంత్ ఐపీఎల్‌లో ఆడతాడనేది ఖాయమైంది. మరి పంత్ ఐపీఎల్ ఆడుతాడు కానీ..టీ 20 వరల్డ్ కప్ లో ఆడుతాడా లేదా అనే కొత్త సందేహం నెలకొంది. ఎందుకంటే.. బీసీసీఐ సెక్రటరీ జయ్ షా నిన్న ఓ నేషనల్ ఛానెల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే పలు సందేహాలకు తావిస్తోంది.

2024 జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో పంత్ ఆడే అవకాశాలపైప్రస్తుతం పంత్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండూ ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిపిన జైషా, అతడు టీ20 ప్రపంచకప్ ఆడితే భారత జట్టుకు పెద్ద బలం చేకూరినట్లువుందని వెల్లడించాడు. పంత్ ప్రస్తుతం బాగున్నాడు. బ్యాటింగ్‌తో పాటుగా కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. పంత్ పై ఎక్కువ భారం ప‌డ‌కుండా వికెట్ కీపింగ్ బాధ్యత‌లు మరొకరికి అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయాన్నీ జై షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. కీపింగ్ చేయగలిగితేనే టీ20 ప్రపంచకప్‍లో రిషబ్ పంత్ ఆడతాడని స్పష్టం చేశాడు.

ఒకవేళపంత్ టీ20 ప్రపంచకప్‌ ఆడగలిగితే.. టీమిండియాకు ప్లస్ పాయింట్. ఐపీఎల్‌లో అతను ఎంతవరకు రాణిస్తాడో స్తాడో చూద్దామని వెల్లడించాడు జైషా.