Phillips Wonderful Catch: ఫిలిప్స్ పిచ్చెక్కించే క్యాచ్.. ఏం పట్టాడురా బాబూ! వీడియో వైరల్

0
30

క్రికెట్ లో జరిగే అద్భుతాలే ఆ క్రీడకు ఇంత పాపులారిటీ తెచ్చిపెట్టాయి. కొన్ని క్యాచ్ లు చరిత్రలో నిలిచిపోతుంటాయి. అలాంటిదే శనివారం కూడా జరిగింది. వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఆటగాడు ఫిలిప్స్ అద్భుతం చేశాడు. శనివారం రెండవ రోజు ఆటలో అద్భుతమైన క్యాచ్ పట్టి ఆస్ట్రేలియా ఆటగాడు లబూ షేన్ ను పెవిలియన్ పంపించాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓవర్ నైట్ స్కోర్ 32/2 తో రెండవ రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు త్వర త్వరగా నే వికెట్లు కోల్పోయినప్పటికీ లబూ షేన్(90) న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు.. 12 ఫోర్ల సహాయంతో 90 పరుగులు చేశాడు.. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్కోరు 221 పరుగుల వద్ద ఉన్నప్పుడు సౌతి బౌలింగ్ లో బ్యాట్ మీదికి దూసుకు వచ్చిన బంతిని లబూ షేన్ అప్పర్ కట్ ఆడాడు. అయితే అది ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. దీంతో ఫిలిప్స్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. దీంతో లభిషేన్ నిరాశగా పెవీలియన్ చేరుకున్నాడు.

 

న్యూజిలాండ్ జట్టు 162 పరుగులకు తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. 38 పరుగులతో లాతం టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు 256 పరుగులకు ప్యాక్ అయింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ 7 వికెట్లు పడగొట్టాడు. సౌతి, సియర్స్, పిలిప్స్ తలా ఒక వికెట్ తీశారు.