ధర్మశాలలో రేపటి నుంచి టీమిండియాతో జరగబోయే ఐదో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. టీమ్ లో ఒక మార్పు చేసిన ఇంగ్లిష్ జట్టు.. ఆలీ రాబిన్సన్ ప్లేస్ లో మార్క్ వుడ్ కు చోటు కల్పించింది. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో వుడ్ చివరిసారిగా సిరీస్‌లో ఆడాడు. కాగా ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్ గెలచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. కాగా ఈ మ్యాచ్ టీమిండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ , ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్టు కావడం విశేషం.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమితో WTC పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమ్‌ఇండియా తొలి స్థానానికి చేరింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 64.58 విజయాల శాతంతో టాప్‌లో నిలవగా.. న్యూజిలాండ్ 60 శాతం, ఆస్ట్రేలియా 59.09 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే.
ఇంగ్లండ్ టీమ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హామ్ , మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్, షోయబ్ బషీర్.
భారత్ టీమ్: : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్ ), రవీంద్ర జడేజా , ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్