మహాశివరాత్రి రోజున వేకువజామునే లేచి స్నానాదికాలు ముగించుకోవాలి. ఇంట్లో పూజ తర్వాత సమీపంలోని శివాలయంలో దైవదర్శనం చేసుకోవాలి. రోజంతా భగవత్ ధ్యానంలో గడపాలి. పంచాక్షరీ మంత్రం జపించాలి. ఉపవాసం ఉండేవారు పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. మరుసటి సాయంత్రం ఆకాశంలో చుక్కలు కనిపించేంతవరకూ జాగరణ చేయాలి.
వీలైనంతగా శివ ధ్యానంలో గడపాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు ఉపవాస, జాగరణ నియమాలను పాటించకపోయినా, సాత్విక ఆహారం తీసుకుని, వీలైనంతగా శివ ధ్యానంలో గడపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేస్తే శివుడి అనుగ్రహం పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.
శివ శివ శివ యనరాదా… భవభయ బాధలనణచుకోరాదా’ అని త్యాగరాజ స్వామి అన్నాడు గాని, అచంచల భక్తితో శివనామాన్ని స్మరిస్తే చాలు, భవభయ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి.