తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం గట్టిగా ఫోకస్ చేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పీఎం మోదీ రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు.
ఈ నెల 12న తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. ఇప్పటికే ఆయన పర్యటన ఖారారైంది.ఈ సందర్బంగా బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాల గురించి చర్చిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.