మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ప్రారంభం.. ఇది కదా కావాల్సింది

0
22

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడటంతో.. అటు ప్రచారం.. ఇటు సంక్షేమం టాప్ గేర్ లో కొనసాగిస్తున్నారు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ. పశ్చిమబెంగాల్ లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలో మరో రికార్డ్ లాంటి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కోల్ కతాలో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ టన్నెల్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. బటన్ నొక్కి అండర్ వాటర్ టన్నెల్ గుండా పోయే మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. హుగ్లీ నది అడుగున భాగంలో.. భారీ సొరంగం ఏర్పాటు చేసి నిర్మించారు.

బెంగాల్‌లో ఇవాళ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ అండర్ వాటర్ మెట్రో నిర్మాణానికి దాదాపు రూ. 120 కోట్ల ఖర్చు చేశారు. హావ్డా మైదాన్ నుంచి ఎస్ పలనాడె స్టేషన్ వరకు ప్రతిష్టాత్మకంగా ఈ అండర్ వాటర్ మెట్రోను నిర్మించారు. ఈ రైలులో జర్నీ ప్యాసింజర్లకు మధురానుభూతి ఇస్తుందనడంలో సందేహం లేదు.