రికార్డు స్థాయిలో పెరిగిరన బంగారం ధరలు

0
16

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా 1,300 పెరగడంతో రూ.63,000 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,420 పెరిగి రూ.68,730కి చేరింది. దీంతో మార్కెట్ చరిత్రలో జీవితకాల గరిష్ఠానికి బంగారం ధరలు చేరాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 68,880గా ఉంది. ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 63,000 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 68,730 గా ఉంది. చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.63,900 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.69,710 మార్క్ కు చేరింది.

దేశం వ్యాప్తంగా వెండి ధర కూడా పెరిగింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.80,800కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 80,800. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.77,800 కు చేరింది.