Holidays: రేపట్నుంచి స్కూళ్లకు మూడు రోజులు సెలవులు

0
12

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపట్నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి, 9న రెండో శనివారం, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. 7వ తేదీన గురువారం సాయంత్రం స్కూల్స్ క్లోజ్ అవుతాయి. 11వ తేదీన సోమవారం రోజున స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయి.

కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు 2వ శనివారం సెలవు ఉండదు. అలాగే మార్చి 25న హోళీ, 29న గుడ్లైఫ్రైడే సందర్భంగా కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ఈ సెలవులపై నోటిఫికేషన్ కూడా అప్రూవ్ చేసింది. ఏప్రిల్ నెలలో కూడా స్కూళ్లకు సెలవులు వచ్చాయి.

ఏప్రిల్ 5వ తేదీన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వచ్చింది.. ఆ రోజు పాఠశాలలకు సెలవు ఉంటుంది. 9వ తేదీన ఉగాది పండగ సెలవు ఉంటుంది. 11వ తేదీన రంజన్ పండగ ఉంటుంది. 17వ తేదీన శ్రీరామ నవమి కోసం సెలవు ఉంటుంది. ఏప్రిల్ 25వ తేదీ లోపు అన్యువల్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ వెంటనే స్కూళ్లకు వేసవి సెలవులు ఇస్తారు. తిరిగి జూన్ 12త తేదీన స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయి.