TS POLITICS : నిజామాబాద్ ఎంపీ బరిలో 42 మంది అభ్యర్థులు..!

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉండేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. ఐదేళ్లకోసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తమ లక్కును పరీక్షించుకునేందుకు పార్టీలకతీతంగా బరిలో నిల్చునేందుకు ఆసక్తి చూపారు. 18వ నిజామాబాద్ లోక్‎సభ ఎన్నికల కోసం అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు పోటీ పడ్డారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా 17 లక్షలపై చిలుకు ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 19న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం వరకు జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కాకుండా ఆదిలాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. 42 మంది మొత్తం 90 నామినేషన్‌లు సమర్పించారని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చివరి రోజైన గురువారం నిజామాబాద్ లోక్‎సభ నియోజకవర్గ స్థానానికి 28 నామినేషన్లు దాఖలయ్యాయి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

కాగా, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కోసం ప్రధాన రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, యుగతులసి పార్టీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాతో పాటు పలు ఎన్నికల కమిషన్ గుర్తింపు లేని ప్రాంతీయ పార్టీలతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు. 2019లో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కొత్త రికార్డులు నమోదు చేసింది. ఎన్నికల నిర్వహణతో పాటు గెలుపు ఓటములు అనాడు దేశం మొత్తం చర్చనీయాంశమైంది. ఈ సారి నామినేషషన్‎ల ప్రక్రియ నాటికి 42 మంది బరిలో ఉండటంతో అందులో పెద్ధ మొత్తంలో స్వతంత్రులు ఉండటం ప్రధాన స్రవంతి పార్టీల కలవరపెడుతుంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‎ల మధ్య పోటీ అని అందరూ అంచనా వేస్తుండగా స్వతంత్రులు బరిలో ఉండటంతో ఎవరికి ఓటు బ్యాంకుకు గండి పడుతుందని అంతట చర్చ జరగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు అదే పార్టీల అభ్యర్థులు పోటీలో ఉండగా బి పారం ఇచ్చిన వారు అభ్యర్ధులుగా మిగిలిన వారు స్వతంత్రులుగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. అదే సమయంలో వారు చీల్చిన ఓట్లు ఏ మేరకు ప్రభావితం చేస్తారనే భయం ప్రధాన రాజకీయ పార్టీలకు ఉంది. అయితే ప్రధాన పక్షాలు నామినేషన్‎లను ఉపసంహరించుకోవడానికి సమయం ఉండటంతో వారిని బుజ్జి గించి లేదా నచ్చ చెప్పడం నయానో భయానో వారిని దారిలో తెచ్చుకొని నామినేషన్ విత్ డ్రాకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల పరిశీలన, విత్ డ్రా కోసం ప్రయత్నంలో ఎంపీ అభ్యర్థులు కాచుకు కూర్చున్నారు.

నామినేషన్లు దాఖలు చేసిన వారు-
1. తాటిపర్తి జీవన్ రెడ్డి (కాంగ్రెస్)
2. గోవర్ధన్ బాజిరెడ్డి (బీఆర్ఎస్)
3. అరవింద్ ధర్మపురి (బీజేపీ)
4. మీసాల శ్రీనివాస్ రావు (బీజేపీ రేబల్)
5. మహమ్మద్ మన్సూర్ అలీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)
6. సుమన్ (ధర్మ సమాజ్ పార్టీ)
7. కండెల దేవత్ శ్రీనివాస్ (బహుజన ముక్త్ పార్టీ)
8. యుగంధర్ గట్ల (అలయోన్స్ ఆఫ్ డేమోక్రటిక్ రిపార్మ్ పార్టీ)
9. భూక్యా నందు (విద్యార్థి రాజకీయ పార్టీ)
10. పోతు అశోక్ (మన తెలంగాణ రాష్ర్ట సమాఖ్య పార్టీ )
11. విఠల్ మాలావత్ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ)
12. అశోక్ గౌడ్ (బహుజన లెఫ్ట్ పార్టీ)
13. పోతు నవీన్ ( అలిండియా బిసి ఓబిసి పార్టీ)
14. సాయికృష్ణ మూర్తి (యుగ తులసీ పార్టీ)
15. పోతు నాగార్జున (ప్రజా సెనా పార్టీ)
16. పానుగంటి రజితావాణి (పిరమిడ్ పార్టీ ఆప్ ఇండియా)
17. బేగరి పోశం (రాష్ట్రీయ మానవ్ పార్టీ)
18. రాపెల్లి సత్యనారాయణ (ఇండిపెండెంట్)
19. రాగి అనిల్ (ఇండిపెండెంట్)
20. రాపెల్లి శ్రీనివాస్ (ఇండిపెండెంట్)
21. ఆరె రాజేందర్ (ఇండిపెండెంట్)
22. గంట చరితా రావు (ఇండిపెండెంట్)
23. సయ్యద్ అస్గర్ (ఇండిపెండెంట్- 2 సెట్లు)
24. మిర్యాలకర్ జయప్రకాశ్ (ఇండిపెండెంట్)
25. కాట్రాజి ప్రశాంత్ (ఇండిపెండెంట్)
26. కోటగిరి శ్రీనివాస్ (ఇండిపెండెంట్)
27. కొత్తకొండ శక్తిప్రసాద్ (ఇండిపెండెంట్)
28. బీ.బీ.నాయక్ (ఇండిపెండెంట్)
29. మొహమ్మద్ జమీల్ (ఇండిపెండెంట్)
30. గోలి నరేష్ (ఇండిపెండెంట్)
31. ఎండీ. షాహెద్ ఖాన్ (ఇండిపెండెంట్)
32. కొండూరు గంగాధర్ (ఇండిపెండెంట్)
33. ముత్యం రఘు (ఇండిపెండెంట్)
34. చెంచుల అశోక్ (ఇండిపెండెంట్)
35. దేశబోయిన లక్ష్మీనారాయణ (ఇండిపెండెంట్)
36. మొగిలి రాజ్ కుమార్ (ఇండిపెండెంట్)
37. పాలమూరు సాయినిఖిల్ (ఇండిపెండెంట్)
38. వేముల విక్రమ్ రెడ్డి (ఇండిపెండెంట్)
39. పుప్పాల లింబాద్రి (ఇండిపెండెంట్)
40. తూటుకూరి జీవన్ రెడ్డి (ఇండిపెండెంట్)
41. గోపి చంద్రయ్య (ఇండిపెండెంట్)
42. వి.మహాతేజ (ఇండిపెండెంట్)