Khammam Warangal Bjp MP aspirants: ఖమ్మం, వరంగల్ బీజేపీ అభ్యర్థులు వీళ్లే.!

0
18

బీజేపీ 72 మంది అభ్యర్థులతో నిన్న సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. లోక్ సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా.. బీజేపీ ఇప్పటి వరకు సొంతంగా 267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 195 మందితో ఫస్ట్ లిస్ట్, 72 మందితో తాజాగా సెకండ్​ లిస్ట్​ను విడుదల చేసింది.

తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇప్పటికే మంది అభ్యర్థులను ప్రకటించారు. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మెదక్ నుంచి రఘునందన్ రావు,ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్, మహబూబాబాద్- నుంచి సీతారాం నాయక్,నల్గొండ నుంచి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ పేర్లను ప్రకటించారు.

రాష్ట్రంలో మొత్తం 17 లోక్​సభ స్థానాలకు ఫస్ట్ లిస్ట్​లో 9 స్థానాలకు, తాజా లిస్ట్ లో 6 స్థానాలకు బీజేపి అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. వరంగల్ విషయంలో హైడ్రామా నడుస్తుంది. బీజేపీలో ఆరూరి రమేశ్ చేరిక ఫైనల్ అని ప్రచారం జరిగింది కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి ఎంట్రీతో సీన్ మారింది. ఈ స్థానం నుంచి వరంగల్ నుంచి మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్ పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరో వైపు ఇటీవల పార్టీలో చేరిన జలగం వెంగళ్ రావు పేరును ఖమ్మం ఎంపీ స్థానానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.