Taf Fight Given 175 Assembly Constituency In AP: 175 స్థానాల్లో పోటీ చేస్తాం..గట్టి పోటీ ఇస్తం: షర్మిల

0
12

రాబోయే ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 1.17 శాతమే ఓట్లు వచ్చినా.. ఈ సారి గట్టి పోటీ ఇస్తుందని చెప్పారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తు దిశగా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. గతంలో ప్రత్యేక హోదా మీద మాట్లాడిన జగన్.. అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట్లాడటం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌‌ను గెలిపించేందుకు పార్టీ నాయకులు సైనికులుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందనడానికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వచ్చిన 1500 అప్లికేషన్లే సాక్ష్యమన్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌‌సభ అభ్యర్థుల ఎంపికపై బుధవారం పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నేతృ త్వంలో ఢిల్లీలో కీలక భేటీ జరిగింది. ఇందులో ఆ రాప్ట్ర ఇన్‌‌చార్జి మాణిక్కం ఠాకూర్, షర్మిల, సీనియర్ నేతలు రఘువీరా రెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు.

కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని షర్మిల వెల్లడించారు. ఇంకొన్ని సీట్లపై కసరత్తు కొనసాగుతోందన్నారు. పూర్తి జాబితా గురువారం మధ్యాహ్నానికి ఖరారవుతుందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసే మూడో జాబితాలో వారి పేర్లు ఉంటాయని తెలిపారు