10th Students To Good News: గుడ్ న్యూస్ .. 5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే

0
13

పదో తరగతి వార్షిక పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించినట్లు SSC బోర్డు తెలిపింది. ఆ తర్వాత వస్తే పరీక్ష రాసేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. కాగా, ఇంటర్ పరీక్షలకూ 5 నిమిషాల నిబంధనను అమలు చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది స్టూడెంట్లు టెన్త్ పరీక్షలకు అటెండ్ కానున్నారు. 2676 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. కాగా, టెన్త్ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకూ కొనసాగనున్నాయి. అయితే, సైన్స్ సబ్జెక్టులో ఈ ఏడాది నుంచి బయాలజీ, ఫిజిక్స్ పేపర్లను రెండు వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు.

టెన్త్ హాల్ టికెట్లు https://bse.telangana.gov.in వెబ్ సైట్​లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.