MP Mithun Reddy Comments On TDP: వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తారు : మిథున్ రెడ్డి

0
18

వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు అన్నింటినీ ఆపేస్తారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థను కూడా తీసేస్తారని చెప్పారు. ఏపీలో రాజకీయ పొత్తులపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అన్ని పార్టీల నుంచి టీడీపీ అభ్యర్థులే పోటీలో ఉంటున్నారని వ్యాఖ్యానించారు. జనసేనకు ఇచ్చిన 21 సీట్లలో 10 మంది, కాంగ్రెస్, బీజేపీల్లోనూ టీడీపీ అభ్యర్థులే పోటీలో ఉంటున్నారని పేర్కొన్నారు.

టీడీపీకి కాంగ్రెస్ కోవర్టుగా పని చేస్తోందని ఆరోపించారు. అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్‌పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు వాలంటీర్ వ్యవస్థపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ వ్యవస్థను రద్దు చేయాలని, ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని రాజంపేటకు చెందిన అబుబాకర్‌సిద్ధి వ్యాజ్యం దాఖలు చేశారు.

ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. దీనిపై గతంలో దాఖలైన పిటిషన్లపై ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించాలని చెబుతూ విచారణను కోర్టు వాయిదా వేసింది.