MLA Gudem MahipalReddy Brother Arrest: పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్

0
27

పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు బీఆర్ఎస్ నేత మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఇవాళ తెల్లవారుజామున మధుసూదన్ రెడ్డి ఇంటికి వెళ్లిన పటాన్ చెరు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ ను నిబంధనలకు విరుద్ధంగా నడిపాడనే కారణంతో తహసీల్దార్ ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. భారీ బందోబస్తు మధ్య గూడెం మదును అదుపులోకి తీసుకుని పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. చీటింగ్, మైనింగ్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నిన్న కేసీఆర్ అన్న కొడుకు అరెస్ట్

మాజీ సీఎం కేసీఆర్​అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్​ కన్నారావు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్​స్టేషన్​లో అటెంప్ట్ టు మర్డర్​, భూ కబ్జా కేసు లు నమోదయ్యాయి. కన్నారావుతో పాటు ఆయన అనుచరులు, పలువురు బీఆర్​ఎస్ నాయకులపై కూడా ఈ కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడ సర్వే నెంబర్ 32/ఆర్​యూయూ లో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్​ సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నా రావు గ్యాంగ్ ప్రయత్నించిందని సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. కన్నారావు ఈ నెల 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు, జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్ లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేశారని ఫిర్యాదులో బండోజు శ్రీనివాస్​ తెలిపారు.