Indrakaran Reddy Shock To BRS: బీఆర్ఎస్ మీటింగ్ కు డుమ్మా.. కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్.?

0
16

లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు ఒక్కొక్కరు షాకిస్తున్నారు నేతలు. కాంగ్రెస్, బీజేపీలోకి నేతలు జంప్ అవుతున్నారు. లేటెస్ట్ గా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కీలక నేత,మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్దమయ్యారు.

నిన్న లోక్‌సభ ఎన్నికల కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌‌ఎస్ నిర్వహించిన కీలక భేటీకి ఇంద్రకరణ్ రెడ్డి డుమ్మాకొట్టారు.దీంతో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రివ్యూ మీటింగ్‌కు గైర్హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనారోగ్య కారణాల వల్లే వారు మీటింగ్‌కు రాలేదని జిల్లా నేతలు చెప్పినప్పటికీ కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇంద్రకరణ్‌ రెడ్డికి నచ్చజెప్పాలంటూ స్థానిక నేతలకు సూచించినట్లు సమాచారం. గురువారం హైదరాబాద్‌లోని కేసీఆర్‌‌ నివాసంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై జరిగిన రివ్యూ మీటింగ్‌ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన హరీశ్ రావు .. జిల్లా నేతలతో ఇంద్రకరణ్ రెడ్డి వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ మారే విషయమై ఇప్పటివరకు ఇంద్రకరణ్ రెడ్డి ఎక్కడా బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారం రోజుల క్రితం నిర్మల్‌లో కొంతమంది సీనియర్ నాయకులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకున్నారని తెలుస్తోంది.మరో రెండురోజుల్లో ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా నాయకులు,తన అనుచరులతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమావేశంలో చర్చించి పార్టీ మారాలా?లేదా అన్నది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.