Lakshmi Narayana: విశాఖ నార్త్ నుంచి మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. పార్టీకి సింబల్ ఇదే

0
22

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై సీబీఐ మాజీ జేడీ, జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రకటన చేశారు. విశాఖ ఉత్తరం సీటు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల స్థానిక స్వపరిపాలన పోయిందని విమర్శించారు. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవడం లేదని అన్నారు.

ప్రస్తుతం సొంతంగా బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు లక్ష్మీనారాయణ. అలాగే జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్‌లైట్ గుర్తును కేటాయించింది. దీనిపై జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. కామన్ సింబల్‌గా టార్చ్‌లైట్ గుర్తును కేటాయించడంపై ఈసీకి ధన్యావాదాలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టార్చ్‌లైట్ వెలిగిస్తాం.. చీకటిని తరిమేస్తామని అన్నారు. ఇద్దరు రాజుల మధ్య ఓ సామాన్యుడి పోరాటం జరుగుతోందన్నారు.

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సొంత పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో హామీలపై బాండ్ పేపర్ రాసిచ్చి సంచలనం సృష్టించారు.