వైఎస్ వివేకానంద వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయన కూతురు సునీత కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. వివేకా ఆత్మీయులతో ఇవాళ భేటీ కానున్నారు. సునీత లేదా ఆమె తల్లి సౌభాగ్యమ్మ ఎన్నికల బరిలో నిలుస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం జగన్ పై సౌభాగ్యమ్మ ఓ ఇంటర్వ్యూలో విమర్శించారు. వివేకా హత్య గురించి ముందే తెలిసినా సాయంత్రం వరకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జగన్కు ఓటేయొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి శిక్ష పడాల్సిందేనని ఇటీవల వైఎస్ సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. సొంత వాళ్లను అంత ఈజీగా అనుమానించలేమన్నారు. అందుకే హత్య జరిగిన తర్వాత జగన్ ను కలిసినప్పుడు ఆయనపై తనకు అనుమానం రాలేదన్నారు. ఆ తర్వాత ఒక్కో విషయం అర్థమయ్యిందని చెప్పారు. ఈ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదని ..ఆయనను కూడా విచారించాలన్నారు. ఈ హత్యలో జగన్ పాత్రపై కూడా విచారణ జరగాలని చెప్పారు.