Iftar Party at LB Stadium: ఇవాళ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు.. హాజరు కానున్న సీఎం

0
17

తెలంగాణ ప్రభుత్వం పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు గౌరవ అతిధులుగా హాజరుకానున్నారు.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమం ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారం భంకానుంది. నాత్-ఎ-షరీఫ్, ఖిరాత్ (ఖురాన్ పఠనం) తో మొదలుకానుంది. అయితే ఇఫ్తార్ సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించబడుతుందని సీఎం కార్యాలయం పత్రికా ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వర్ఫ్ బోర్డు పర్యవేక్షణలో జరగనున్న ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వేదిక వద్ద నమాజ్-ఎ-మగ్రిబ్ (ఇఫ్తార్ విందు అనంతరం నమాజ్) కోసం ఏర్పాట్లు చేశారు. నిర్ధారిత సమయంలో ఆహ్వానితులు వేదికకు చేరుకోవాలనే నిబంధన ఉంది.

రంజాన్ ఉపవాస దీక్షలుమార్చి 12 నుండి ప్రారంభమయ్యాయి. ఒక నెలపాటు ఉపవాసం ఉండి అల్లాను ప్రార్థిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదో నెలను రంజాన్ నెల అంటారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆధ్యాత్మిక ప్రార్థనలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ఉపవాసం ఉంటారు.