ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ పిఠాపురం పోటీ హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పిఠాపురంలో చేదు అనుభవం తప్పదని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పొలిటికల్ ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా పవన్ ఇక్కడికి వచ్చారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడే ఇండిపెండెంట్‌ను నిలబెట్టి పవన్‌ను ఓడిస్తారేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ భరత్. ఇక్కడి రాజకీయ పరిణామాలను జనసేన నేతలు లోతుగా పరిశీలించుకోవాలని సూచించారు. పిఠాపురం శాసన సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని పవన్ కల్యాణ్ మార్చి 14న ప్రకటించారు. జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి తీరుతామన్నారు.
ప్రజలు పొత్తును ఆశీర్వదించి.. కూటమిని గెలిపించాలని పవన్ కోరారు. శాంతి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. జగన్ అధికార దాహాంతో కొట్టుమిట్టాడుతున్నారని, సిద్ధం గ్రాఫిక్స్ లతో జగన్ అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు టీడీపీ-జనసేన కూటమి తరఫున జనసేన టికెట్‌ను తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిల్లా శ్రీధర్ ఆశించారు. టీడీపీ నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మ పోటీ చేయాలని భావించారు. వారి అనుమతితోనే పవన్ ఈ సీటులో తాను పోటీ చేస్తానని ప్రకటించనట్టు తెలుస్తోంది.