BRS Car TopGear: ఎలక్టోరల్ బాండ్లు.. ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ టాప్

0
23

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను ఈసీ నిన్న వెల్లడించింది. మొత్తం రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసినట్లు డేటాలో వెల్లడైంది. వీటిలో ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా బీఆర్ఎస్ కు రూ.1,214 కోట్లు, బీజూ జనతా దళ్‌కు రూ.775 కోట్లు, DMKకు రూ.639 కోట్లు, YCPకి రూ.337 కోట్లు, టీడీపీకి రూ.219 కోట్లు, శివసేనకు రూ.158 కోట్లు విరాళాలుగా వచ్చాయని పలు కథనాలు పేర్కొన్నాయి.

సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు మేరకు గురువారం సాయంత్రం ఈసీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో రెండు భాగాలుగా ఈ వివరాలను పొందుపరిచింది. మొదటి భాగంలో బాండ్లు కొనుగోలు చేసినవారి వివరాలు, వాటి విలువ, రెండో భాగంలో ఆయా బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు తేదీలతో సహా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఫ్యూచర్‌ గేమింగ్, హోటల్‌ సరీ్వసెస్‌ అనే సంస్థ అత్యధిక విలువైన బాండ్లు కొనుగోలు చేసి టాప్‌–1గా నిలిచింది.

ఏ పార్టీకి ఎన్ని నిధులు..?(రూ. కోట్లలో):

బీజేపీ – 6061

తృణమూల్ కాంగ్రెస్ – 1610

కాంగ్రెస్ – 1422

బీఆర్ఎస్ – 1215

బిజూ జనతాదళ్(బీజేడీ) – 776

డీఎంకే – 639

వైఎస్ఆర్సీపీ – 337

టీడీపీ – 219

శివసేన – 158

ఆర్జేడీ – 73

ఆప్ – 65

జేడీఎస్ – 44

సిక్కిం క్రాంతికారి మోర్చా – 37

ఎన్సీపీ – 31

జనసేన – 21