తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేటితో 100 రోజులు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి 5 హామీలను అమలుచేస్తున్నట్లు రేవంత్ ప్రభుత్వం తెలిపింది. వీటిలో RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10లక్షలకు పెంపు, అర్హులకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం, పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేసిన సర్కార్ రెండు కీలక ఎలివేటెడ్ కారిడార్ల పనులకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం, విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు విశ్రాంత జడ్జిల కమిటీలను ఏర్పాటు చేశామని ప్రగతి నివేదిక లో పేర్కొంది.
అభయహస్తంలో మరో ఎనిమిది పథకాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇంకా మహిళలకు నెలకు రూ.2500లు, రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000లు, వ్యవసాయ కూలీలకు రూ.12,000లు, వరి క్వింటాలుకు రూ.500ల బోనస్ ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం అమలు కావాల్సి ఉంది. ఇళ్లు లేని పేదలకు స్థలం, రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షలు విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు, పింఛను రూ.4000లకు పెంపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాల్సి ఉంది.
డబుల్ డెక్కర్ కారిడార్ కు పునాది, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు శంకుస్థాపన, గవర్నమెంట్ ఐటీఐల్లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందం, దావోస్ నుంచి పెట్టుబడులు , 30 వేల ఉద్యోగాలు ధరణి సమస్యలు పరిష్కారానికి కమిటీ, నోటిఫికేషన్లు, ఉద్యోగ నియామకాలు ఇలాంటి వాటిని అన్నింటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలోనే వేసుకుంది.