Supreme Court: ఎలక్టోరల్ బాండ్స్ పై మరో బాంబు పేల్చిన సుప్రీం కోర్టు

0
19

ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీం కోర్టు మరో బాంబు పేల్చింది. ఎలక్టోరల్ బాండ్స్‌కు సంబంధించి SBIకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నంబర్లతో సహా సమర్పించాలని చెప్పింది. దీంతో ఎవరు ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చారో బహిర్గతం కానుంది. ఇక బాండ్ల ద్వారా అధిక మొత్తంలో విరాళాలు పొందిన రాజకీయ పార్టీలలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో టీఎంసీ కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, బీఆర్ఎస్, డీఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జేడీఎస్, ఎన్సీపీ, జేడీయూ, ఆర్జేడీ, ఆప్, ఎస్పీ, తదితర పార్టీలున్నాయి.

జనవరి 2024 వరకు విక్రయించిన బాండ్ల విలువ రూ.24, 738 కోట్లు. రెండు ప్రధాన జాతీయ పార్టీలలో బీజేపీకి అత్యధికంగా 46.74శాతం (రూ. 11,562.5కోట్లు), కాంగ్రెస్ కు 11.39 శాతం (రూ. 2,818కోట్లు) అందాయి.

విరాళలో రెండవ అతిపెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెస్.. ఈ పార్టీకి మొత్తం విరాళాలలో 13శాతం (రూ.3.215 కోట్లు) అందాయి. బీఆర్ఎస్ కి 9.21 శాతం (రూ.2278.37కోట్లు), బీజేడీకి 6.27 శాతం రూ.1550కోట్లు విరాళాలు అందాయి. నాలుగైదు స్థానాల్లో ఈ రెండు పార్టీలు నిలిచాయి.

టాప్-10లో డీఎంకే (రూ.1230కోట్లు), వైఎస్ఆర్ సీపీ (రూ662కోట్లు), తెలుగుదేశం (రూ.437.76కోట్లు), శివసేన (రూ.316కోట్లు), ఆర్జేడీ (రూ.145కోట్లు) పార్టీలున్నాయి.

ఆమ్ ఆద్మీపార్టీకి రూ.130.9కోట్లు, జనతాదళ్ సెక్యులర్ రూ.87కోట్లు, సిక్కిం క్రాంతిమోర్చా రూ.73కోట్లు విరాళాల రూపంలో పొందాయి. టాప్-5 దాతలలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ (రూ1,368 కోట్లు), మేఘా ఇంజనీరింగ్ (రూ.980కోట్లు), హల్దియా ఎనర్జీ (రూ.377 కోట్లు), వేదాంత (రూ400కోట్లు), క్విక్ సప్లయి చైన్ (రిలయన్స్ సంస్కృ రూ.410కోట్లు) ఉన్నాయి.