Sharukh Khan : షారుఖ్ నోటిదూలా.. టాలీవుడ్ హీరోలంటే అంత చిన్న చూపా.?

0
24

ప్రస్తుతం టాలీవుడ్ గ్లోబల్ స్థాయికి చేరుకుంది. తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. మంచి ఆదరణ వస్తున్నాయి. తెలుగు హీరోలు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. దేశవిదేశాల్లో ఎక్కడ చూసినా వీళ్ల క్రేజ్ మామూల్గ లేదు.. ఓ విధంగా చెప్పాలంటే.. బాలీవుడ్ హీరోలను సైతం మనోళ్లు వెనక్కి నెట్టారు. అయినా సౌత్ హీరోలన్నా..సినిమాలన్నా వాళ్లకు ఓ చిన్నచూపని సినిమా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం..

ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జామ్ నగర్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో స్టేజ్ పై అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ , రామ్ చరణ్ కలిసి నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ పాటలో నటించిన రామ్ చరణ్ కూడా ఆ వేడుకల్లో ఉండటంతో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను స్టేజిపైకి పిలిచి తనతో నాటు నాటు పాటకు స్టెప్స్ వేయించాడు. అది కూడా ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది.అయితే రామ్ చరణ్ ను స్టేజ్ పైకి పిలిచేటప్పుడు షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

ఆ సమయంలో రామ్ చరణ్ ను ఇడ్లీ, వడ అంటూ సంబోధించడం తనకు నచ్చలేదని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హాసన్ అన్నారు. ఇదే విషయంపై ఆమె ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టారు. షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ను స్టేజిపైకి పిలిచేప్పుడు ఇడ్లీ, వడ అంటూ సంబోధించడం నాకు అస్సలు నచ్చలేదు. చాలా హార్ట్ అయ్యాను. అందుకే అక్కడినుండి వెళ్ళిపోయాను.. అంటూ రాసుకొచ్చారు జెబా. ప్రస్తుతం జెబా పెట్టిన పోస్ట్ వైరల్ అవగా.. మెగా ఫ్యాన్స్ షారుఖ్ ఖాన్ పై ఫైర్ అవుతున్నారు. మిమ్మల్ని వడాపావ్, భేల్ పూరి అని పిలిస్తే ఊరుకుంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు