AP Politics: ఎన్నికల్లో పోటీకి దూరం..నాగబాబు కీలక ప్రకటన

0
17

వచ్చే ఎన్నికల్లో పోటీకి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు దూరంగా ఉంటున్నారు. లోక్ సభ బరిలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి వల్ల నాగబాబుకు నిరాశ ఎదురయ్యింది. కూటమిలో భాగంగా తన సీటు నాగబాబు వదులుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ బరిలోనైనా పోటీ చేస్తారని అనుకున్నారు కానీ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగబాబు ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

జనసేన పార్టీలో ఒక జన సైనికుడిగా పని చేయడం కన్నా గొప్ప పదవీ, గౌరవం మరొకటి లేదన్నారు నాగబాబు. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబంతో గడపాల్సిన విలువైన సమయాన్ని, సినిమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఆస్థులను కూడా ప్రజల కోసం త్యాగం చేసి గొప్ప నాయకుడుపవన్ కళ్యాణ్. ఆయన నాయకత్వంలో జనసేన పార్టీ కోసం పని చేయడం ఓ అదృష్టం. అలాంటి గొప్ప నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని గౌరవించడం, గలిపించడం జనసైనికుడిగా నా కర్తవ్యం.

తమ సమస్యలను ప్రజల సమస్యలుగా భావించే నాయకులు చాలా మంది ఉన్నారు కానీ, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అరుదుగా ఉంటారని చెప్పారు. ఎంతో మంది జని సైనికులు, వీర మహిళలు, నాయకులు కూడా పదవుల కోసం కాకుండా నాయకుడి ఆశయం కోసం నిలబడే వారు జనసేనలో లక్షల్లో ఉన్నారు. అలా పార్టీ కోసం, నాయకుడి ఆశయాల కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ జనసేనలో విశిష్టమైన గౌరవం ఉంటుందని ఎల్లడించారు నాగబాబు.