సస్పెన్స్ కు తెరపడింది. ఎట్టకేటలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో తన కుమారుడు గిరితో కలిసి ముద్రగడ వైసీపీ కండువా కప్పుకున్నారు.
ముద్రగడను పవన్ కి పోటీగా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి బరిలో దింపేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా,రాకున్నా పార్టీలో చేరానని ముద్రగడ క్లారిటీ ఇచ్చాడు.
ముద్రగడ పద్మనాభం దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. 2009లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. జనతా పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఒక సారి ఎంపీగా గెలుపొందారు. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముద్రగడతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని వైసీపీ ప్లాన్ చేసింది. ఆయన కొడుకు గిరికి నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.