Khairatabad RTO: ఫస్ట్ డే ఆర్టీఏ ఫుల్ ఇన్ కమ్..ఫ్యాన్సీ నంబర్లకు మస్తు గిరాకీ

0
15

తెలంగాణలోటీజీ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్ మొదలయ్యింది. వాహనాల రిజిస్ట్రేషన్​ టీజీ 0001 నంబర్​తో​ప్రారంభమయ్యాయి. వాహనదారులు 0001 నుంచి 0999 వరకు రిజర్వు చేసుకోవచ్చు. ప్రతి రోజు అంతకు ముందు రోజు రిజిస్ట్రేషన్​ అయిన నంబర్​ నుంచి 1000 లోపు ప్రస్తుత విధానంలోనే టీజీ సిరీస్​లో రిజర్వు చేసుకునే అవకాశం ఉంది, రాష్ట్రంలో ఏపీ సిరీస్ తో​రిజిస్ట్రేషన్​ అయిన వెహికల్స్​ 70,68,252 ఉండగా టీఎస్​సిరీస్​తో రిజిస్ట్రేషన్​ అయిన వాహనాలు 92,82,903 ఉన్నట్టు అధికారులు తెలిపారు.

ఫస్ట్ డే ఫుల్ ఇన్ కమ్

మొదటి రోజే ఆర్టీఏకు భారీగా ఆదాయం వచ్చింది. ఖైరతాబాద్ ఆర్టీఏ జోన్ పరిధిలో టీజీ 09, 0001 నంబర్​ను రుద్రరాజు రాజీవ్​కుమార్​అనే వాహనదారుడు దక్కించుకున్నారు. దీనికి ఆయన రూ.50 వేలు రిజర్వేషన్​ఫీజు చెల్లించి వేలంలో రూ.9,11,111లకు నంబర్ సొంతం చేసుకున్నారు. అలాగే, టీజీ 09, 0909 నెంబర్​ను భవ్యసింధు ఇన్​ఫ్రా ప్రాజెక్ట్స్​ ప్రైవేట్ లిమిటెడ్ వేలంలో రూ.2,20,909లకు దక్కించుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఫీజు రూపంలో రూ.1,25,11,000 లు, నంబర్ల​వేలం ద్వారా రూ.1,26,75,437 లు కలిపి మొత్తం ఒక్కరోజులోనే ఆర్టీఏకు రూ.2,51,86,437ల ఆదాయం వచ్చింది